Tuesday, April 14, 2020

కరోనా హఠావో దేశకో బచావో

11/04/2020
మ్మింది ఒక మహమ్మారి, కారు మబ్బులా, అనురాగమంత దేశాన్ని
రోగమన్నారు అందరూ, కరోనా అని పేరు పెట్టరు కొందరు
నాసి రకం కాదిది, నామరూపాల్లేకుండా చేస్తుంది మానవ జాతిని
రించేందుకు వచ్చిన విపత్తు,ప్రపంచం మొత్తాన్ని
ఠారెత్తించింది, తన గుప్పిట్లో పెట్టుకుంది,ఆట ఆడిస్తోంది
వ్యోమగామిలా అంతరిక్ష విహారం మానేసి 
దేశంలో వ్యాపించి,అంటించి,వృద్ది చెందింది
శంఖ అక్కర్లేదు, ఇది రోగమే, కానీ దాని నిరోధన మన చేతుల్లో ఉంది
కోమలమైనా,కఠినమైనా, చేతుల్ని కడుక్కోండి సబ్బుతో 
వ బంధాల కోసం ఇంట్లోనే ఉండండి బాధ్యతతో 
చావుని ఆహ్వానించకండి నిర్లక్ష్యంతో
వ్యోమయాన ప్రయాణం మానుకోండి ఆరోగ్యంతో



Monday, April 13, 2020

మీడియాకు వందనం

వలస పిట్టలన్నీ వరస కడుతున్నాయి, సొంత గూడు చేరాలనేమో
ఎగిరే రెక్కలు లేకపోయినా చేరగలమనే నమ్మకమేమో
అపుడెపుడో దండీ యాత్ర గురించి విన్నాను
ఇప్పుడు చూస్తున్నా, కాని ఇది తిండి యాత్ర
రోజు కూలీలను కూటి కోసం కదిలించింది కరోనా 

రోడ్లన్నీ వెలవెల బోతున్నాయ్
భేరాలు ఆడే కొనుగోలుదారులు లేరు
రేట్లు చెప్పే కొట్టువాళ్లు లేరు
వేడి వేడి పూరీలేసే బండి వాడు లేడు
అన్నా,ఇంకో ఇడ్లీ అని అడిగి తినే వాడు లేడు
బాబు కొంచెం జరుగమ్మ అని అడిగే ముసలివాళ్లు లేరు
అంకుల్ బాల్ అని అడిగే ఆటగాళ్లు లేరు
పార్కుల్లో ప్రేమికులు లేరు
సినిమా హాళ్లల్లో స్నేహితులు లేరు
మాల్లల్లో ఫామిలీలు లేరు
పాన్ డబ్బా దగ్గర పొగగాళ్లు లేరు
"బారు"లు తీరిన జనం లేరు
ఛాయి షాప్ దగ్గర ఎదురుచూసే కష్టమర్లు లేరు
ప్రయాణికుల రద్దీ లేదు
రవాణా శాఖల్లో హడావిడి లేదు

కవుల కలం మాత్రం వేగంగా కదులుతుంది, కరోనా పై అదే కదనమని
కలమే కరవాలమని భావించి
కలాన్ని కదిపిన కళకు,కళను పోశిస్తున్న మీడియాకు వందనం....

శ్వేతపుష్పం

ముక్కోటి దేవుళ్లు, మూడు శాఖల వారు

కరోనా కమ్మింది చూపించక కరుణ
కరుణామృతాన తడిసే మనిషికేనా ఈ కరోనా
కరోనా మహమ్మారిని తరిమి మనం నిలిచేనా
నిలిచేనా మానవజాతి ఈ వైరస్తో పోరున

ఆకుకూరలు,ఆశీర్వాద్ కోసం తిరుగుతుంది మనం
మనమే సహరించకుంటే ఎందుకీ జన్మం
జన్మలో మంచి పనంటే ప్రభుత్వానికి సాయం 
సాయం అంటే నీ ఇల్లే నీ ప్రపంచం

నిస్సారమైన బ్రతుకుల్లో వెలుగు నింపే దీపం
దీపాన్ని వెలిగించి పూజించాల్సిన రూపం
రూపాంతరం చెంది మానవుడిగా వచ్చిన వైనం
వైనాన్ని సైతం వెక్కిరించిన జనం 
జనం కోసం త్యజించిన ప్రాణం
ప్రాణమున్నంత వరకు వైద్యులే మన దైవం

బట్ట మాసినా,నింద మోసినా మెరిసిపోతుంది ఖాకీ 
ఖాకీ బట్టలతో మురిసిపోతుంది లాఠీ 
లాఠీ ఎత్తకుండా చూసుకోవడం మన డ్యూటీ 
డ్యూటీ పేరుతో సేవ చేస్తుంది పోలీస్ ఆర్మీ

ఇంటింటికి తిరిగి చెత్త ఎత్తడం వారి ధర్మం 
ధర్మం కోసం ప్రాణం కూడా లెక్క చేయకపోవడం త్యాగం
త్యాగం చేసి రోడ్లన్నీ చేస్తున్నారు శుభ్రం 
శుభ్రంగా ఉండలేకపోవడం మన కర్మం
కర్మను కూడా మార్చగలగడం వారికే సాధ్యం 
సాధ్యమా పారిశుద్ధ్య కార్మికుల్లా పని చెయ్యడం

ముక్తపదగ్రస్తంతో మూడు శాఖల (పోలీస్,వైద్య,పారిశుద్ధ్య కార్మికులకు) వారికి శతకోటి అభివందనాలు తెలియజేస్తూ 

శ్వేతపుష్పం

వైద్యుడికి నీరాజనం

కనపడలేదా కరోనా కాఠిన్యం
కళ్లు తెరిచి చూడు, నీ కళ్ల ముందే కదులుతూ కనపడుతుంది
కన్న పిల్లల్ని వదిలేసి
కట్టుకున్న వాళ్లని కాదని
కన్నీళ్లు ధారలా కారుతున్నా
కర్తవ్యం కోసం కరుడుకట్టిన వైద్య బృందం 

కరోనా బాధితులే తమ బంధువులని
కరోనా అంతమే తమ బాధ్యత అని
కళ్లలో వత్తులేసుకున్న తమ కుటుంబాలకన్నా
కళ్ల ముందు బాధపడుతున్న వారే ముఖ్యమని
కంటి మీద కునుకు లేక
కడుపుకింత కూడు లేక
కరోనా మనకంటకుండా
కంచెలా తమ ప్రాణాల్ని అడ్డుపెట్టి కాపలా కాస్తున్నారు

కంటకాలు దారిలో తగిలినా
కరోనా మహమ్మారి సోకినా
కన్న ప్రేమ కన్నా వృత్తికే విలువనిచ్చారు
కనుక వాళ్ల కాళ్లకి మొక్కినా ఋణం తీర్చుకోలేము
కనీసం మన వంతు బాధ్యతనైనా నిర్వర్తిద్దాం
కదలకుడా ఇంట్లోనే ఉందాం

కరోనాతో యుద్ధంలో వారికి భారం అవ్వకుండా ఉందాం
కదనంలో ఈసారి కాలు బయట పెట్టకుండా వారి సేవకి సలామందాం
కలనైనా చూడని కరోనా మహమ్మారి కొసం శ్రమించే వారి పనిని గౌరవిద్దాం
కవితాంజలి నా కలం పలుకుతోంది వైద్యులారా
కరుగుతూ కొవ్వొత్తిలా వెలిగిస్తున్నారు మా ప్రాణాల్ని
కనుకనే అందుకోండి మా పాదాభివందనాల్ని

తమ ఇల్లు వాకిలి,కట్టుకున్న వారు, కన్న వారు, వారు కన్న వారు అందర్ని వదిలేసి, ప్రాణాల్ని త్యజించి మన కోసం పోరాడుతున్న వైద్య బృందానికి నీరాజనం పడుతూ

శ్వేతపుష్పం

మేలుకో కరోనాని ఎదురుకో.

ప్రభాత భానుడి మయూఖాలే సాక్ష్యం
నా అంతరంగతరంగాలే భాష్యం
ఎగసే రుధిర కెరటాలే సాక్ష్యం
ఇది కరోనాపై నా కవన కదనం

ఝంఝా మారుత సమీరాల్లా వ్యాపించింది
నలుదిశ కనుమలు దాటి విస్తరించింది
కరోనా హాహాకారాల ప్రతిధ్వనితో ప్రకంపించింది నేల
వైరస్, వాహినై ప్రవహిస్తుంది ఈ వేళ

కరచాలనమే తనకి ఆవాహనం
హస్త ప్రక్షాలనే దానికి ఔషధం   
నీ ద్వారం వెలుపలే దాని చలనం
పాదం కదలికే నీకు మరణం
స్వీయ నిర్బంధమే  క్షేమం
ఆచమనమే దానికి వైరం

ధైర్యపు వల్లకి తంత్రిని మీటి చూడు
ఆ స్వనముల అలజడే మహమ్మారికి భయం
నీ మనో నేత్ర గవాక్షం తెరచి చూడు
నీ గృహమే నీ రక్షణా వలయం

కరోనా కేకలు నీ కర్ణభేరిని తాకని చోటు నీ మనోస్తైర్యం
అది కొల్లగొట్టి నిన్ను చేరడం అసాధ్యం
మేలుకో కరోనాని ఎదురుకో...

Saturday, August 24, 2013

సంధర్బోచిత పాట

పల్లవి:

రచించనీ ప్రతీ కవి విరించిలా ఈ కథ
మదించనీ ప్రతీ కల రచించగాఈ కథ
ఎవ్వరికెవ్వరు ఏమవుతారని ఎవరికి తెలియని లోకంలో
ఏ దరికి నిను చేరుస్తుందో ఎప్పుడు ఎరుగని మార్గంలో
ఇది విదాత రాసిన విచిత్ర గాధ
విదిలో నలిగే విషాద గాధ

చరణం1:
దేవుడి చదరంగమిది, బ్రతుకుతో రణరంగమిది
చావుకి చెలిమికి నడుమన నలిగిన నరకమిది
మనిషితో పోరాటమిది,బ్రతికేందుకు పోరు ఇది
ఇరువురి మధ్యన ఊగిసలాడే మరణమిది
ఏ కథని ముగించునో, ఎవరి కలని మిగుల్చునో
 
శ్వేతపుష్పం

పౌరుషం....గౌరవం .

పసికందు ప్రాణం తీసే శౌర్యం 
అర్ధాంగిని అవమానించే నీ పౌరుషం
ప్రేమగా నిన్ను చూసుకునే వారిపై నీ ప్రతాపం....
నీ నాశనానికి నువ్వే రాసుకున్న నీ జాతకం..
ఆడవారిపై గౌరవం 
నీ జననానికి శ్రేయస్కరం.....