Saturday, August 24, 2013

సంధర్బోచిత పాట

పల్లవి:

రచించనీ ప్రతీ కవి విరించిలా ఈ కథ
మదించనీ ప్రతీ కల రచించగాఈ కథ
ఎవ్వరికెవ్వరు ఏమవుతారని ఎవరికి తెలియని లోకంలో
ఏ దరికి నిను చేరుస్తుందో ఎప్పుడు ఎరుగని మార్గంలో
ఇది విదాత రాసిన విచిత్ర గాధ
విదిలో నలిగే విషాద గాధ

చరణం1:
దేవుడి చదరంగమిది, బ్రతుకుతో రణరంగమిది
చావుకి చెలిమికి నడుమన నలిగిన నరకమిది
మనిషితో పోరాటమిది,బ్రతికేందుకు పోరు ఇది
ఇరువురి మధ్యన ఊగిసలాడే మరణమిది
ఏ కథని ముగించునో, ఎవరి కలని మిగుల్చునో
 
శ్వేతపుష్పం

పౌరుషం....గౌరవం .

పసికందు ప్రాణం తీసే శౌర్యం 
అర్ధాంగిని అవమానించే నీ పౌరుషం
ప్రేమగా నిన్ను చూసుకునే వారిపై నీ ప్రతాపం....
నీ నాశనానికి నువ్వే రాసుకున్న నీ జాతకం..
ఆడవారిపై గౌరవం 
నీ జననానికి శ్రేయస్కరం.....

ఆడపిల్ల

ఆడపిల్ల అంటే చిక్కు ప్రశ్నల కలయిక...
తను పలికే ప్రతి పదం మెలిక..
అవి కాదని అంటే బుంగమూతితో అలక..
ఆ అందం కోసం చెరపాలి మన అహపు పలక..
తీర్చాకే నీకు అందేది ఇంక పడక..
అవి లేకుంటే నీ బ్రతుకంతా సమస్యల గులిక...
అందుకే ఆదరించరా మగువల కోరిక.....

శ్వేతపుష్పం 

ఎన్నిక వరం..........

ఎన్నికలొచ్చాయి...ఆహా పేద ప్రజలకది పైసలిచ్చే కాలం
ఫలితాలొచ్చాయి....అబ్బో మహా నాయకులకది కాసులిచ్చే వర్షం
పదవులొచ్చాయి......ఓహో దేశనేతలకది పైకాలిచే సిమ్హాసనం 
ఐదేలయ్యాయి........వాహ్ మన జనాలకి మిగిలింది ఆశల సౌధం 
మాటలెమ్మయాయి......అబ్బ ఇంకా చెప్పాలా మన ప్రతినిధులు మనకిచ్చిన కోరికల వరం...

శ్వేతపుష్పం 

జీవిత వేదాంతం...........

జననం అంటే తెరచిన నీ నేత్రం
బాల్యం అంటే కరిగించిన తీపి స్వప్నం
కౌమారం అంటే తప్పుకీ ఒప్పుకీ మధ్య సమరం
యవ్వనం అంటే చిలిపి ఊహల సామ్రాజ్యం
వృదాప్యం అంటే అనుభవానికి అర్ధం
చివరి మరణం అంటే మూసిన నీ నయనం 
ఇదే జీవిత వేదాంతం..............

శ్వేతపుష్పం 

హొయల సిరులు...

హొయల సిరులు దాచేసుకున్న కులుకుల జింక
పడుచు అందాలు పరుచుకున్న పరువాల చిలక
సిగ్గు వాకిట్లో చిందులేస్తున్న వయ్యారి మేనక
నీ రూపు చూసి తలదించుకుంది నింగిలోని నెలవంక
నీ ఈ సౌందర్యానికి అందుకో జోహారిక 

శ్వేతపుష్పం

వివేకమైన అజ్ఞానం నా జీవితపు అర్ధంలా....

విమర్షలే ఎదురైతే అన్ని వేళలా
అవమానలెదురొస్తే వెనుతిరగని బాణంలా
గుండెల్లో దాగున్న భాదల్నే పదంలా
కరిగించా నా హృదయపు అద్దంలా
వివేకమైన అజ్ఞానం నా జీవితపు అర్ధంలా 
"రచ్చా రంబోలా" నా బ్రతుకు కవుల కవితలా
వెటకారపు రచనకు నేనే ఓ రూపంలా 
వ్యంగ్యమైన హాస్యానికి నేనే ఓ ప్రతీకలా
మారాను నేనిలా 

శ్వేతపుష్పం 

మగువ....

పుట్టకనే అంతం చేసే తల్లి తండ్రుల పాడు ఆలోచన
పుడితే భారం అనుకునే జనుల చెడు ఆచరణ
పుట్టుకకే అర్ధం చెప్పే ఆడపిల్ల అవతరణ
పుట్టుకనే పుట్టించే పడతికెందుకీ యాతన
పుడమి తల్లే చేరుతుంది కన్నీటి సరసన 
పుట్టలేని, పుట్టుకనిచ్చే మగువ విషాదాన 

శ్వేతపుష్పం 

కపట నిద్ర....

అరచకాలతో మరుగుతున్న ఈ లోకం 
మనకెందుకులే అని తప్పించుకునే జనం పిరికితనం
దేవుడున్నడు కదా అనుకునే పిచ్చి మైకం
దైవం శిక్షిస్తాడని ఊరుకునే చేతకానితనం
కపట నిద్రనా మరి నీ యోగం
అసలు కాంచవా నువ్వీ ఘోరం 
అడుగుతున్న ఈ కవి కలం 

శ్వేతపుష్పం 

సరస్వతి

విధాత నాలుక వేదిక చేసుకున్న భారతి
నీ అనుగ్రహం కోసం చేరుకున్నా పాఠశాల తరగతి
నా పై దయ చూపి మార్చాలి నా గ్రహాల స్థితీ గతి
సరస్వతి, నువ్వే పెంచాలి నా మేధా శక్తి
నీ జాలి చూపి ఇప్పించు విద్యా వసతి 

శ్వేత పుష్పం 

ఆత్మవిశ్వాసమే....

వివేకంతో మసలుకుంటే నీకే మేలు
అజ్ఞానం నేర్పిన కీడు చాలు
అపనమ్మకమే నీ బాటకు అవరోధాలు
ఆత్మవిశ్వాసమే నీ విజయానికి ఆనవాలు
దాటరా ఎదురొచ్చే అడ్డంకులు
మార్చరా ముళ్లను పూల దారులు 

శ్వేత పుష్పం

రాజకీయ నాయకులు

దేశానికి చీడ పురుగులు రాజకీయ నాయకులు
చరిత్ర పుటకే చెదలు రాజకీయ నాయకులు
కపట వేషదారులు అవినీతికి సాక్ష్యాలు
అరచేత వైకుంఠాలు గద్దెనెక్కే మాయ మాటలు
ఓటు కొరకు ఉచితాలు నోటు కొరకు మోసాలు
చేయకున్నా మాకు మేలు చేయకండి కీడు చాలు
విన్నారా!!జనుల విన్నపాలు
మానండి ఇకనైనా ఖజానా దొంగతనాలు

శ్వేత పుష్పం 

లంగ ఓని

పల్లెల్లో పొదిగి ఉన్న పడుచు చిన్నది
పరికిణితో కంట పడింది కన్నె పిల్లది
లంగ ఓని చూసి ఎన్ని సంవత్సరాలయ్యింది
అంతరించి పోతున్న నాగరికతకి 16 అణాల తెలుగు అమ్మాయి లాగ వచ్చి జీవం పోసింది
కంట పడదనుకున్న అందాన్ని కనులు ముందు నిలిపింది

శ్వేత పుష్పం 

ఓ యువత!!!!!

పట్టుదలతో పట్టు నువ్వు పంతం 
అవకాశమైన విజయమే నీ సొంతం
గుర్థు పెట్టుకొ సల సల కాగే నీ రక్తం
అదే చూపాలి నీకున్న మార్గం
ఓ యువత!! మెలుకో ఇదే నీ సిద్దాంతం 
కాదోయి ఇది వేదాంతం 
తెలుసుకో నీ గమ్యమే నీ సర్వం 

శ్వేత పుష్పం 

పసివాడి మనోవేదన....

విద్యాలయాల్లో నేటి చదువు మోయలేక మోస్తున్న పుస్తకాల బరువు
అమ్మ వినలేవా నా మనోవేదన అని అడుగుతున్న పిల్లాడి కన్నీటి కొలువు
విద్య కోసం వెతుకులాటలో ఆటపాటలకి కరువు
మార్కుల కోసం పోటీలో ఎక్కడుంది సంతోషాల కల్పతరువు
చదువు కొరకు వేటలో అలసిన నా పసి తనువు 
ఎప్పుడెప్పుడని చూస్తోంది తరిగిన అమ్మ చనువు 
చిన్నా!! నువ్వెన ఎదురైన చిన్ని కలవు 
అని జాలిగా అడుగుతోంది వదిలివెళ్లిన ఆ సెలవు!!

శ్వేత పుష్పం 

రాజకీయం ....రణరంగం

వక్ర రాజకీయాల కుట్ర సంఘం
కుల్లు కుతంత్రాల స్వార్ధ లోకం
మనసు మనసుకి మధ్య పెరుగుతున్న పోరాటం
మనిషి మనిషికి అంటకట్టిన రణరంగం
అదే కదా మనల్ని మార్చిన దుష్ఠ చర్యల పాడు రాజకీయం 

శ్వేత పుష్పం 

భారత దేశం....

భారత దేశం అన్ని నదుల పుట్టినిల్లు
అది బంగరు కలల సొంత కళ్లు
సర్వ కులాల ఆనవాలు
చూపుతున్న రాష్ట్రాలు
సఖల మత పునాదులు,నాటిన మంచి తనపు ఋజువులు
మానవత్వపు ఇల్లు,కట్టిన బంధం అనే పాలరాతి రాళ్లు
అందుకే మన దేశం మనకి సొంత ఇల్లు

శ్వేత పుష్పం 

వర్ణన....

హరివిల్లు మారెనే మగువ కనుబొమ్మగా
వసంతం చేరెనే స్త్రీ మోము రూపుగా
కోకిల వచ్చెనే ఆడపిల్ల గొంతుగా
తెలవారుతున్న కాంతి వెలుగు కనపడుతుంది నీ నుడుటి బొట్టుగా
సంధ్యా వేళ అందం కనులు కాంచెను నీ లేత నవ్వుగా 
అలల సముద్రం మారుతోంది నీ కంటి బిందువుగా
నీలాల ఆకాశం చేరుతోంది నీ కురుల సిరులుగా 
పూల పరిమళం సాగుతోంది నీ ముగ్ధ మనోహరమైన తనువుగా 
నదుల నడక కనపడుతుంది ఓ అబల నీ సోయగాల సొత్తుగా 

శ్వేత పుష్పం

చిలిపి నటి...

ఇలియానా నడుములో ఉంది తెలియని మైకం
కాజల్ రంగులో చూపింది తన సోయగం
అనుష్క తన "ఎత్తు"పల్లాలతో రేపింది నాలో చిరు కాంక్ష 
త్రిష లేపింది నాలో తనపై ఉన్న చెప్పలేని వాంఛ
శ్రీయ అందం చూసి అంది నా మనసు తనే నా గుండె లయ 
జెనీలియా చిలిపి తనమే నా వయసుకి నేర్పింది నాకు తుంటరి తనపు మాయ 

ఇన్ని అందాలు నా సొంతమైతే అదే కదా జీవితానికి గొప్ప వరం 


శ్వేత పుష్పం 

తడి సవ్వడి

నీ నవ్వుల చిరు సడి రేపింది నా గుండెలో అలజడి
నీ కన్నుల నిశబ్ధ వేడి మనసులో నిలిచింది అలా నేర్పి కలల జడి
పెదాలపై తడి సవ్వడి ఎక్కించింది నాలో ఆకలి దప్పుల కాంక్ష ముడి
నీ ఎదపై ఎగసి పడి మల్లె చెప్పింది నీ ఎత్తుపల్లాల ఒరవడి
అందుకే చేరా నీ కౌగిలి కోటకి తీరుస్తావని ఆ తీరని వాంఛల సందడి

శ్వేత పుష్పం

జీవితం..

జీవితానికి అనుభవం పాఠాలు నేర్పే తరగతి 
పట్టుదలకి అర్ధం మనసుని చూపే నీ గతి
విజయమే నీ కష్టానికి వచ్చే పురోగతి
మనసే అంటుంది మంచిని చూసి ఇదే నీ పరిస్థితి 
శ్వేతపుష్పమే నా కవితకి ప్రాణం పోసిన ఇంతి 

శ్వేత పుష్పం 

శృంగారం....

పాలపుంతల సోయగాల నెర జాణ
నన్ను తడపని నీ ముద్దుల తేనె వాన 
ఒదిగుండని పడకగా నీ ఎద వీణ
తూలిపోని నీ ఒంపుసొంపుల మత్తున 
ఎదురుగా చేరనా శృంగార మలుపున 
ఆనందం పంచి రాసక్రీడలో నిత్యం నీ గుండెలో నిలువనా 

శ్వేత పుష్పం 

రాజకీయ శూలం..

నీతిపై సంధించిన శూలం రాజకీయం
మనసునే బంధించిన దారం తీపి ప్రణయం
కళ్ళనే కరిగించిన స్వప్నం నీటి ప్రళయం
కవితనే అందించిన కలం శ్వేత పుష్పం

శ్వేత పుష్పం 

కితకితలు...

డాక్టర్ డాక్టర్ నిన్న నేను తాగాను జాని వాకర్
దానితో వచ్చింది నాకు కొద్దిగా ఫీవర్
నేను తిన్నదేమో చిన్న మాటర్
బైటికి వచ్చిందేమో మొత్తం క్వార్టర్
ఐనా తాగాను మొత్తం లీటర్
అది కూడా విథౌట్ వాటర్ 
అందుకే వచ్చాను నీ క్లినిక్ సెంటర్ 
తీర్చవా నా బాధ డాక్టర్ 

శ్వేత పుష్పం 

ఏకాంత సేవ :D :D :P

ఏకాంత సేవలో ఏ కాంతనో రేపిన తుంటరి కోరిక
మల్లె పల్లకిపై చలిని తుంచె వెచ్చని కౌగిలి పడక
రసవత్తర ఆటలో కసరత్తులు నేర్పే తీయని అలక
చెలి ముద్దుల సవ్వడి మౌనంగా వినే నిషిదే వేదిక 
రతి యుద్దానికి సిద్ధం అనే పెదవి పలక 
శృంగార కీర్తనలు పాడే అందాల చిలక 

శ్వేత పుష్పం

అమ్మ

స్వరాలు ఎరుగని సంగీతం
పదాల కందని సాహిత్యం
అమ్రుతమంతా లిపిగా చేసి 
అనురాగన్నే పదంగా చెస్తే అమ్మ

శ్వేత పుష్పం

శ్వేతపుష్పం ante

నీ ప్రేమే జ్ఞాపకాల సాగరం
నీ పిలుపే ఊహల కెరటం
నీ వలపే ఆశల జలపాతం
నీ చెలిమే తలపుల ప్రవాహం
నిన్నారాధించే కలమే శ్వేతపుష్పం


శ్వేత్ పుష్పం 

viplavam కాటుక

రుధిర సాగరమే సాక్ష్యం రాలిన కుంకుమ బొట్టుకి
తెగిన తలలే జ్ఞాపకం పగిలిన చేతి గాజులకి
చెదిరిన శాంతే అద్దం వాడిన మల్లె పూవులకి
కూలిన శవాలే శబ్దం పలికిన కాలి మెట్టెలకి
మిగిలిన మౌనమే సమాధానం బ్రతుకును అడిగిన తాళి బొట్టుకి 
చెదిరిన కలలే కళలు కురిసిన కాటుక కన్నులకి......

శ్వేత పుష్పం 

నిప్పుతో బనాయింపు

నిప్పు తొక్కిన కోతిలా చిందులు ఆపు అలా
చుడలేక కన్నులా మూసుకున్నా నేనిలా
చెవ్వి కోసిన మేకలా అరుపులు కేకలా
పాడుతున్న పాటలా వినలేని ఏడుపులా
కాలు కాలిన పిల్లిలా తిరగమాకు నువ్వలా
చూస్తుంటే నిన్నలా పుట్టింది రోతిలా 
బావా........ఇంకా చెప్పాలా నీకే తెలియాలా 



శ్వేత పుష్పం 

పెదవి

పెదవి విరుపులు దేనికి చెలి, కౌగిలి దరిచేరమనా?
అలక పానుపు ఎందుకు ప్రియా, మల్లె పడకను ఎక్కమనా?
అంత కినుక అవసరమా సఖి, కునుకు వదిలే పనికి రమ్మని
దాహం తీర్చనా కౌగిలిలో !!!
మోహం తగ్గించనా మల్లె పడకపై !!!


శ్వేత పుష్పం 

కలవరం

కలత చెందితే కలవరం
కనులు మూస్తే కల ఓ వరం
కలం తాకితే కళే ఓ వరం
కవిత అంటే కళలవరం


శ్వేత పుష్పం

Wednesday, August 21, 2013

నా గురించి..

Vivek 
బ్లాగ్ క్రీయేట్ చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ అలా అలా సమయం గడిచిపోయింది కాని ఆ సమయం మాత్రం ఇప్పుడే వచ్చింది.. 
దీనికి నాకు స్పూర్తి రుషి, నా స్నేహితురాలు...నేను రాసిన కవితలు మరిచిపోవడం నాకున్న చెడ్డ అలవాటు అది పొందుపరుచుకోలేకపోవడం మరీ చెడ్డ అలవాటులా అనిపించింది అందుకే ఈ బ్లాగ్ ప్రయత్నం.....చూసి నా కవితల సమాహారం గురించి మీ విలువైన అభిప్రాయాలు నాకు అందిస్తారని నా ఆశ...  ఇంతకీ ఈ శ్వేతపుష్పం ఏంటా అని ఆలోచిస్తున్నారా అది నా కలం పేరు...నా పేరు కన్న కలం పేరుతో కవితలు రాద్దామని చాలా మంది గొప్ప గొప్ప కళాకారుల అడుగు జాడల్లో నదుద్దామని కలం పేరు పెట్టుకున్నాను..ఇంక దాని అర్ధం విషయానికి వస్తే తెల్లని పువ్వు అని అర్ధం... అంటే నా కవిత అంత స్వచ్చమైనది అని (నా కవిత నాకు నచ్చుతుంది కదా).. ఇంక ఆదరించడం నిరాకరించడం మీ చేతుల్లో ఉంది...           

ప్రస్తుతానికి ఇంతే ఉంటాను....

నమస్కారం 

వివేక్